విద్యార్ధులకు ఉచిత బస్ పాస్లు

మనికొండ మునిసిపాలిటీ బీ. ఆర్.ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే. రామకృష్ణ రెడ్డి సహాయ సహకారాలతో మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో చదివే విద్యార్ధులకు సంవత్సరానికి 50/- చెల్లించి పొందే బస్ పాసులు తమ వంతు ఆర్థిక సహాయం, బస్ డిపో మేనేజర్ లక్ష్మి ధర్మ, సి.ఆర్.సి ధర్మెoదర్, వీ.బీ.ఓ శ్రీనివాస్ ఆ.ర్టీ.సీ అధికారుల సహకారంతో 257 మంది
విద్యార్థినీ విద్యార్థులకూ స్కూల్ హెడ్ మాస్టర్ మాంగ్య నాయక్ ఆధ్వర్యంలో ఉచితముగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, కౌన్సిలర్ వసంత్ చౌహన్ లు సహకరించారనీ, విజయలక్ష్మి, రాజేంద్రప్రసాద్, శ్రావణ్, శ్రీకాంత్, గంగాధర్, దిలీప్, భాను చందర్, పాఠశాల అధ్యాపకులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం అయ్యింది. అలాగే మనికొండ నుండి హై టెక్ సిటీ, విప్రో సర్కిల్ వరకు స్కూల్ సమయాలలో ఎక్స్ప్రెస్ బస్సు లు కాకుండా ఎక్కువ శాతం ఆర్డినరీ బస్సెస్ ను నడపాలని డిపో మేనేజర్ ని కోరగా వారు సానుకూలంగా స్పందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking