క్రీడాకారులకు స్వర్ణ యుగం మంత్రి మహేందర్‌ రెడ్డి

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: తెలంగాణలో క్రీడాకారులకు సీఎం కేసీఆర్‌ పాలనా స్వర్ణయుగంగా నిలుస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల,గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు.
తొలి తెలుగు భారత అంతర్జాతీయ ఓపెన్‌ వాటర్‌ స్విమ్మర్‌ గోలి శ్యామల మంత్రి మహేందర్‌ రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.సెప్టెంబర్‌ 3న కలకత్తాలో జరిగిన భగీరథ నది లో 81 కిలోమీటర్ల దూరం కేవలం 13 గంటల్లో ఈదిన సందర్భంగా మంత్రి మహేందర్‌ రెడ్డి
శ్యామలను శాలువాతో సత్కరించారు. పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఓపెన్‌ వాటర్‌ స్విమ్మర్‌ గోలి శ్యామల గత ఏడాది గోలి శ్యామల తాలైమన్నారు (శ్రీ లంక) నుండి ధనుషకోడి (భారత దేశం) వరకు హిందూ మహాసముద్రం లో 13:43 గంటలు ఈది ప్రపంచ రికార్డులు స్థాపించడం పట్ల మంత్రి అభినందించారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 36కిలోమీటర్ల గల కేటలిన ఛానల్‌ ను 20 గంటల్లో ఈదిన
తొలి తెలుగు మహిళ గా భారత దేశపు ఖ్యాతిని, తెలంగాణ సమాజ గౌరవాన్ని దశ దిశలకు వ్యాపింపజేస్తూ మువ్వన్నెల జెండాను ఎగురావేశారని కొనియాడారు.
రానున్న రోజుల్లో గోలి శ్యామల పాల్గొనే పోటీలకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని మహేందర్‌ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని క్రీడా అంశాలలో నైపుణ్యం గల క్రీడాకారులను ప్రభుత్వం ఆదరిస్తుందని, వారికి పెద్దపీట వేసి వారిని అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా చూస్తుందని మహేందర్‌ రెడ్డి చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking