హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: రాష్ట్రంలో కుల వృత్తుల గౌరవం పెరిగేలా సీఏం కృషి చేస్తున్నారని మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అన్నారు.రాజేంద్రనగర్ లోని కోకపేటలో సగర కులస్తులకు ప్రభుత్వం కేటాయించిన రూ. 2 కోట్ల నిధులతో
2 ఎకరాల భూమిలో సగరకుల ఆత్మ గౌరవ భవన నిర్మాణ పనులకు మంత్రులు సోమవారం శంకుస్థాపన చేశారు. చేసిన మంత్రులు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ వకులాబారణం కృష్ణమోహన్,సగర కుల సంఘం రాష్ట్ర నాయకులు మారుతి సాగర్, శేఖర్ సాగర, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కుల వృత్తుల ప్రోత్సాహంలో భాగంగా సగర కులస్తుల సైతం
అర్హులైన వారందరికి 100 శాతం సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తుందన్నారు.
ప్రపంచంలోనే అద్భుతంగా పేరు గాంచిన ఇంటింటికి మంచినీళ్లు అందించే తెలంగాణ రాష్ట్ర పథకం మిషన్భ భగీరథ కు సగర కులస్తుల దైవం భగీరథ పేరు పెట్టి సీఎం కేసీఆర్ గౌరవించారనీ వారు గుర్తు చేశారు.
ట్యాంక్ బండ్ పై భగీరథుని విగ్రహం కోసం కృషి చేస్తామన్నారు.
సగర కులస్తులను బిసి డి నుండి బీసీ – ఏ గ్రూపులో చేర్చాలన్న డిమాండ్ ను సీఎం కేసీఆర్కు నివేదిస్తామని మంత్రులు తెలిపారు.
సగరులకు నిర్మాణరంగంలో రిజర్వేషన్లు కోరుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు నివేదిస్తాం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.