వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మేఘా ఆరోగ్య శిబిరం

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 1 మార్చ్ 2024:
వీ.ఆర్.ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్కాపుర్ టౌన్శిప్ 16వ రోడ్ నేతాజీ పార్క్ లొపల 3 మార్చ్ 2024 ఆదివారం రోజున ఉదయం 7 నుండి 12 వరకూ తలపెట్టిన ఉచిత మేఘా ఆరోగ్య శిబిర స్థలాన్ని ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అందె లక్ష్మణ్ రావు, కోశాధికారి దిలీప్ కక్కడ్, ట్రస్ట్ మెంబర్ 8 వ వార్డ్ కౌన్సిలర్ ఆలస్యం నవీన్ కుమార్, మెడ్కేర్ ట్రస్ట్ డయాగ్నొస్టిక్ మేనేజింగ్ డైరెక్టర్ తబ్రేజ్ హుస్సేన్, కాశిరాం మరియు ఫస్ట్ కేర్ ఫార్మసీ తరపున అశ్విన్, శేఖర్ రెడ్డిలు పర్యవేక్షణ చేసినారు, ఉచిత మేఘా ఆరోగ్య శిబిరంలో మధు మేహా రక్త పరీక్షలతో పాటు ప్రత్యేకంగా కన్వర్జ్ బయోటెక్ పరికరంతో అరికాళ్ళ మధుమేహ పరీక్షలు, ఈ.సీ.జీ తదితర పరీక్షలు నిర్వహించబడునని, వెంకటేశ్వర కాలనీ అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి ఉచితంగా వేడి వేడి అల్పాహారాన్ని అంద చేస్తారని, మంచినీటి వ్యవస్థ స్ధానిక 9వ వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్ స్వామీలు ఏర్పాటు చేస్తున్నారని, ఫస్ట్ కేర్ ఫార్మసీ వారు బీ.పీ, ఎత్తు, బరువులతో పాటు ప్రత్యేకత కలిగిన బీ.ఎమ్.ఐ పరికరంతో ఉబకాయం, క్రొవ్వు అనాలిసిస్ పరీక్షలు చేస్తారని, ప్రముఖ జనరల్ డయాబెటిక్ డాక్టర్ పీ.పీ.రమ్య, సీనియర్ ఫ్యామిలీ ఫిసిసియన్ డాక్టర్ నర్సింహ రావు, మానవ నరాళ ప్రఖ్యాత డాక్టర్ చక్రధర్ రెడ్డి (న్యూరలోజిస్ట్) గుండె జబ్బుల నివారణ విభాగంలో విఖ్యాతి గాంచిన డాక్టర్ శ్రీరాములు కడియాల (కార్డియాలజీస్ట్) పేరు ప్రక్యాతలున్న ఎముకల డాక్టర్ శ్రీనివాస్ బోగ (శ్రీరామ్ క్లినిక్స్) ప్రఖ్యాత పంటి డాక్టర్ శ్రీకాంత్ (అక్షయ డెంటల్) మరియూ ఆక్యూపంక్చరిస్ట్ లు డాక్టర్ ఆడెం మనోహర్, డాక్టర్ కల్పనా ఎమ్.డీ-ఏ.ఎం వార్లు ఆక్యూ పంక్చర్ గావిస్తారని ఇట్టి ఉచిత సేవలన్ని గైకొన్న తదుపరి డాక్టర్ల సలహా మేరకు నోయెల్ ఫార్మా కంపెనీ (కోసూరి సత్య జగదీశ్) వారి మందులను అందె లక్ష్మణ్ రావు ఆర్థిక సహాయంతో ఉచితంగా పంపిణీ చేస్తారని మరియు విచ్చేసిన వారందరికీ ఇండో కెం హైజీన్ ప్రొడక్ట్స్ మాస్క్ల తయారీ దారుడు ఆనంద్ మాస్క్లు పంపిణీ చేస్తారని ఇట్టి అన్ని ఉచిత సెవల సదావకాశాన్ని మణికొండ వాసులు సద్వినియోగ పరచు కొగలరని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు ఇతర ట్రస్ట్ సభ్యుల వినమ్ర వినతి.
గమనిక: పార్కులో సదుపాయం లేనందు వలన స్త్రీల సంబంధిత డాక్టర్ నగేశ్వరీ (గైనోకాలజీ) చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్ జి. వెంకటరమణ, చేవు ముక్కు గొంతు ప్రముఖ డాక్టర్ రామక్రిష్ణ వారందరూ అల్కాపుర్ రోడ్ 22 వద్దగల మెడ్కార్ డయాగ్నొస్టిక్ లో 5వ తేది మంగళవారం రోజున ఉచిత పరీక్షలు నిర్విహిస్తారు అట్టి సదుపాయాన్ని సద్వినియోగ పరచు కోగలరని మనవి.

Leave A Reply

Your email address will not be published.

Breaking