డిగ్రీ కోర్సు లలో విద్యార్థుల శాతాన్ని పెంచాలి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 1:
మల్కాజ్గిరి, కూకట్ పల్లి లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల భవన నిర్మాణానికి స్థలము గుర్తించి త్వరలోనే నిర్మాణము జరుగునట్లు తగిన చర్యలు తీసుకుంటామని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
శుక్రవారం కలెక్టరేటులోని విసి సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అండ్ రివ్యూ కమిటీ, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ లతో కలిసి డిగ్రీ కళాశాలలలో మౌలిక వసతులు, నిర్వహణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ మల్కాజ్గిరి, కూకట్పల్లి మండలాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి త్వరలోనే నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మల్కాజ్గిరి లో ఒకే భవనంలో జూనియర్, డిగ్రీ కళాశాలలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు సరిపడా స్థలం, వాడుకునేందుకు నీటి వసతి లేదని ప్రిన్సిపాల్ తెలుపగా, కళాశాల నిర్మాణానికి స్థలం గుర్తిస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. కళాశాలలో ఈ విద్యాసంవత్సరం లో జరిగిన ప్రవేశాల గురించి ప్రిన్సిపల్స్ ను అడిగి తెలుసుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో అన్ని డిగ్రీ కోర్సు లలో విద్యార్థుల శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్స్ కు సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్స్ అలివేలు మంగమ్మ, శైలాజా, సునీత, సుమలత, కళాశాలల కో ఆర్డినేటర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.