మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేంద్ర రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 1:
శుక్రవారం ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1 వ తేదీ నుండి 9 వరకు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శామీర్ పేట లోని తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. నిర్ణీత గడువు లోపు ధరణి పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాల పనితీరును జిల్లా అదనపు కలెక్టర్ విజయేంద్ర రెడ్డి పరిశీలించారు. రికార్డులను పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో శామీర్పేట తహశీల్దార్ యాదగిరి రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.