నిర్లక్ష్యపు నీడలో గ్రామపంచాయతీలు
స్పెషల్ సార్లు జర దృష్టిపెట్టండి
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి మార్చి 1 (ప్రజాబలం) అశ్వరావుపేట రూరల్ డంపింగ్ యార్డులో తడి పొడి చెత్త వేరు చేయాల్సినటువంటి చెత్త ఎక్కడికి అక్కడ కొట్టుకుపోయి దర్శనమిస్తుంది. తడి పొడి చెత్తను వేరు చేసి వేరువేరు రకాలుగా ఉపయోగిస్తారు. అలాంటి తడి చెత్త డంపింగ్ యార్డ్, డంపింగ్ యార్డ్ ను ఆనుకొని ఉన్నటువంటి బాత్రూములు నిన్నగాక మొన్న కట్టినవి శిథిలావస్థకు చేరుకొని మాపై జర దృష్టి సారించండి అంటూ మొరపెట్టుకుంటున్నాయి. తడి చెత్తతో ఎరువులు తయారుచేసి.. హరితహారం మొక్కలకు ఉపయోగిస్తారు. అలాగే పొడి చెత్త యందు ఉన్నటువంటి గాజు గ్లాసులు, సీసాలు, ఇనుప సామాగ్రి వేరువేరు గదులలో పేర్చి వేరు వేరు చేసి స్క్రాప్ కు అమ్ముతుంటారు తద్వారా గ్రామపంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చుతారు. అలాంటి డంపింగ్ యార్డ్ నందు ఉన్నటువంటి తడి చెత్త పొడి చెత్త రూపురేఖలు లేకుండా నిర్లక్ష్యానికి గురవుతుంది. పొడి చెత్త ఎక్కడపడితే అక్కడ పడేసి.. గాలిలో కలిసిపోతున్నాయి. గ్రామపంచాయతీకి రావలసినటువంటి ఆదాయం గాలిలో కొట్టుకుపోతున్నాయి. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు అశ్వరావుపేట మండలంలో ఇదే పరిస్థితులు దాపరించాయి. ప్రధానంగా అశ్వరావుపేట మండలంలోని.. రెడ్డిగూడెం గ్రామపంచాయతీ నందు ఈ దుస్థితి నెలకొంది. అధికారుల పర్యవేక్షణ కరువై, డంపింగ్ యార్డ్ నందు బాత్రూమ్స్ వెలవెలబోతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు డంపింగ్ యార్డు నందు బాత్రూమ్స్ తో పాటు.. తడి చెత్త పొడి చెత్త పై ప్రత్యేక శ్రద్ధ వహించి, చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.