ఇల్లు లేవు బట్టల్లేవు వ్యవసాయ అభివృద్ధి లేదు
త్రీఫేస్ కరెంటు లేదు బోరు మోటారు లేవు.!!
ఐటీడీఏ దృష్టి సాధించాలి ప్రత్యేక అధికారి ప్రత్యేక దృష్టితో నిలపాలి
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి మార్చి01 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం కొండరెడ్ల బతుకు చిత్రం మారే పరిస్థితి కనిపించడం లేదు. దేశానికి స్వతంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్న నేటికీ తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, కనీసం ఉండటానికి ఇల్లులేని దయనీయ పరిస్థితుల్లో కొండరెడ్లు కొట్టి మెటాడుతున్నారు. తెలివితేటలున్న కొద్దో గొప్ప చదువుకొని ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులు పావు పిల్లలను పాము తిన్నట్టుగా కొండ రెడ్ల, భూములను తక్కువ ధరలకు కొనుక్కొని అందలం ఎక్కుతున్నారు. కొద్దిగా.. తెలివితేటలు ఉన్నవారు ముందడుగు వేస్తున్నారు. 95% మంది కొండ రెడ్లు మాత్రం.. వెనకబడి ఉన్నారు. అనేకచోట్ల కనీసం తినటానికి తిండి లేని పరిస్థితి వారిది. వీరిపై అధ్యయనం చేసి వీరిని అభివృద్ధి చేయాల్సినటువంటి అధికారులు ఎక్కడా కానరాకపోవడం శోచనీయం. కొండరెడ్ల అభివృద్ధికి ప్రత్యేక అధికారి నియమించినప్పటికీ ప్రత్యేక అధికారి ప్రత్యేక దృష్టితో కొండరెడ్లను చూడడం లేదని అరాకరా చర్యలతోనే సరిపెడుతున్నారని వాదనలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. కొండ రెడ్ల జీవన విధానంపై సక్రమంగా తెలిసినటువంటి అధికారి నియమిస్తే బాగుండేదంటూ చర్చలు జోరందుకున్నాయి. కొండ రెడ్లకు వ్యవసాయం చేసుకునేందుకు మోటార్లిచ్చి విద్యుత్ సౌకర్యం మరిచార అంటూ విమర్శలు ఘోరంగా వినబడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి.. కొండరెడ్ల జీవనస్థితి దయనీయంగా ఉన్నది. అనేక చోట్ల వారి గ్రామాల అభివృద్ధి ఆమడ దూరంలోనే ఉన్నది. కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి వారిది. చదువుల్లో సైతం అంతంత మాత్రంగానే ఉన్నారు. వారి గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామస్తులు వారిని దోచుకునే పనిలోనే ఉన్నారు. వారి కష్టాన్ని సైతం దోచుకుంటున్నారు. ఐటీడీఏ వారికి ఇచ్చిన సౌకర్యాన్ని సైతం పక్క వారు కాజేస్తున్నారు. ప్రధానంగా అశ్వరావుపేట నియోజకవర్గం లోని.. దమ్మపేట మండలంలో గల పూసుకుంట, అశ్వరావుపేట మండలంలోని రెడ్డిగూడెం,గాండ్లగూడెం లో ఉన్నటువంటి రెడ్డి గుంపు గ్రామస్తులు, అలాగే కావడి గుండ్ల గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి.. కొత్త కన్నాయిగూడెం రెడ్డి గుంపు గ్రామస్తులు అభివృద్ధిలో ఆమడ దూరం ఉన్నారు. వ్యవసాయపరంగా అంతంతమాత్రంగానే అభివృద్ధి సాధించారువ్యవసాయపరంగా ఐటిడి వారిచ్చిన మోటర్లకు నేటికీ త్రీఫేస్ కరెంటు ఇవ్వకపోవడం దారుణం అంటూ కొండరెడ్లు ఆరోపిస్తున్నారు. అనేక కొండ రెడ్ల గ్రామాలకు జలగం ట్రస్టు తరుపున బోర్లు మోటర్లు వేయించి ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి కొండరెడ్ల గ్రామాలకు సరైన ఇల్లు, బోర్లు మోటర్లు త్రీఫేస్ కరెంటు లేకపోవడం అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణలో దారుణమంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని త్రీఫేస్ కరెంటు, మోటార్లు ఉన్నటువంటి లైన్లను కొంతమంది దగ్గరున్న కరెంటు ను, వారు అరా అరాకుర మొట్ట జెప్పి.. కరెంటు లైన్ ల సైతం కాజేసారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనేకమందితో చాకిరీ చేయించుకుని వారి శ్రమను దోచేస్తున్నారు. వ్యసనాలకు బానిసలను చేస్తున్నారు. శ్రమ దోపిడి కి గురవుతున్నారు ఐటీడీఏ గిరిజనులపై ప్రత్యేక దృష్టి నిలిపి మంచి నీతి నిజాయితీ కలిగిన అధికారిని వేసి.. ఐటీడీఏ కు ప్రత్యేక నిధులు కొండరెడ్లకు కేటాయించి ఇల్లు, వాహనాలు, బోరు మోటర్లు త్రీ ఫేస్ కరెంటు ఇస్తే బాగుంటుందని గిరిజన కొండ రెడ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రజా ప్రతినిధులు ఐటిడిఏ చొరవ చూపి గిరిజనులను కొండరెడ్లను ప్రత్యేకంగా ఆదుకోవాలని.. కొండ రెడ్లు వేడుకుంటున్నారు. అలాగే కొండ రెడ్లను దోచుకుంటున్న దోపిడి దారుల సంగతి సైతం చూసి అక్రమంగా వారి భూములను త్రీఫేస్ కరెంటును లాక్కున్న వారిపై సైతం చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు