ఖమ్మం ప్రతినిధి మార్చి 01 (ప్రజాబలం)ఖమ్మం నగరంలోని కస్పా బజార్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అక్షయ క్లాత్ మార్ట్ ప్రారంభోత్స వ వేడుకను శుక్రవారం నిర్వహించగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీకారం చుట్టారు. అనంతరం ఖమ్మం డిప్యూటీ మేయర్ షేక్ ఫాతిమా జోహరా, కార్పొరేటర్ కమర్తపు మురళి తో కలిసి మాట్లాడారు. ఆధునిక హంగులతో ఏర్పాటైన ఈ క్లాత్ మార్ట్ అనతి కాలంలోనే విశేష జనాదరణ పొందాలని ఆకాంక్షించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లు ఉండాలని, ధరలు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని మార్ట్ నిర్వాహకులకు దయాకర్ రెడ్డి సూచించారు