ఉమ్మడి ఖమ్మం జిల్లాకు భారీగా ఎంపీ నిధులు

 

201 పనులకు రూ.9.38 కోట్లు మంజూరు

మొత్తం రూ.9.80 కోట్లకు ప్రతిపాదనలు

సీసీ రోడ్లు, కల్వర్టులు, కాంపౌండ్‌ గోడల నిర్మాణానికి

కరెంట్‌ పోల్స్‌,కొత్త లైన్ల ఏర్పాటుకు ఎంపీ నిధులు కేటాయింపు

వందశాతం ఎంపీ నిధులు సద్వినియోగం

బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు వెల్లడి

ఖమ్మం ప్రతినిధి మార్చి 01 (ప్రజాబలం) ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి తన ఎంపీ నిధుల నుంచి మొత్తం 218 పనులకు రూ.9 కోట్ల 80 లక్షలకు ప్రతిపాదనలు పంపగా, ఇప్పటి వరకు 201 పనులకు గాను రూ.9 కోట్ల 38 లక్షలు మంజూరైనట్లు బీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్‌ సభ్యులు నామ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.తన పదవీ కాలంలో వంద శాతం ఎంపీ నిధులను సద్వినియోగం చేసుకున్నామని పేర్కొన్నారు. మంజూరైన ఎంపీ నిధులను సీసీ రోడ్లు, కల్వర్టులు, స్కూల్‌, హెల్త్‌ సెంటర్‌, అంగన్‌వాడీ భవనాల కాంపౌండ్‌ గోడల నిర్మాణానికి, కరెంట్‌ పోల్స్‌, కొత్త లైన్ల ఏర్పాటుకు ఖర్చు చేయడం జరుగుతుందని చెప్పారు.ఈ మొత్తం నిధుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19 పనుల కోసం రూ.79 లక్షల 50 వేలు , ఖమ్మం జిల్లాకు రూ.4 కోట్ల 14లక్షల,60వేలు కేటాయించినట్లు నామ పేర్కొన్నారు. పార్టీ స్ధానిక ప్రజా ప్రతినిధులు, బడుగు , బలహీన వర్గాలు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని, అన్ని వర్గాల వారికి ఎంపీ నిధులు కేటాయించినట్లు చెప్పారు. మధిరలో ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ. 20 లక్షలు, జిలుగుమాడు జడ్పీ స్కూలు కాంపౌండ్‌ వాల్‌కు, మాటూరుపేటలో పిహెచ్‌సీ, అంగన్‌వాడీ సెంటర్‌లకు కాంపౌండ్‌ వాల్‌కు అశ్వారావు పేటలో రైతుల కోసం కల్వర్టు నిర్మాణానికి నిధులు ఇచ్చామన్నారు. రఘనాధపాలెం మండలం జీకే బంజర గ్రామ పంచాయతీ భవనం , దుబ్బతండలో ఎంపిపిఎస్‌ స్కూలు కాంపౌండ్‌ వాల్‌కు, చింతగుర్తి హెల్త్‌ సబ్‌ సెంటర్‌కు నిధులు మంజూరు చేశామన్నారు. ఖమ్మం ఖిల్లా ఏరియాలో సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణానికి రూ.28 లక్షలు కేటాయించా మన్నారు తల్లాడ మండలం రామానుజవరంలో ఓపెన్‌ జిమ్‌, చిల్డ్రన్‌ పార్క్‌ కోసం రూ. 10 లక్షలు మంజూరు చేశామని నామ వివరించారు. సింగరేణి మండలం గాదెపాడు, రఘనాధపాలెం మండలం రేగుల చెలక, బోనకల్‌ మండలం రావినూతల, ఎర్రుపాలెం మండలం నర్సింహాపురం గ్రామాల్లో కరెంట్‌పోల్స్‌, కొత్త లైన్ల ఏర్పాటు కోసం రూ. 15 లక్షలు మంజూరు చేసినట్లు నామ వెల్లడిoచారు. మధిర మండలం ఆత్కూరు, సిరిపురం, మాటూరుపేట, కూసుమంచి మండలం లోక్యతండా,కొత్తతండా, మంగళితండా, పోచారం, గంగబండతండా, లింగారం తండా, పెరికశింగారం, జుజ్జూలరావుపేట, ఎర్రగడ్డతండా, కంసాలి తండా, వైరా మండలం గొల్లపూడి, పాలడుగు, దాచాపురం, ఖానాపురం, రెబ్బవరం, తాటిపూడి, నేలకొండపల్లి మండలం చెర్వుమాదారం, కోరట్లగూడెం గ్రామాలకు ఎంపీ నిధులు మంజూరు చేశామన్నారు. అలాగే బోనకల్‌ మండలం ముష్టికుంట్ల, బ్రాహ్మణపల్లి, రావినూతల, మోటమర్రి, ఆళ్లపాడు, చొప్పకట్లపాలెం, లక్ష్మీపురం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గంధసిరి, బాణాపురం, వేంసూరు మండలం కండ్రుగట్లమల్లెల, కల్లూరు మండలం యజ్ఞ నారాయణపురం, చింతకాని మండలం ప్రొద్దుటూరు, లచ్చగూడెం, బస్వాపురం, తిమ్మినేనిపాలెం, రఘు నాధపాలెం మండలం జీకే బంజర, రఘునాధపాలెం, చింతగుర్తి, రేగుల చెలక, ఖమ్మం రూరల్‌ మండలం కొండాపురం, ముత్తగూడెం, ఎంవీపాలెం, సింగరేణి మండలం దుబ్బతండ, గాదెపాడు, ఎర్రుపాలెం మండలం ఇనగాలి, నర్సింహాపురం, తల్లాడ మండలం మల్లారం, నారాయణపురం, రామానుజవరం, ఖమ్మం కార్పొరేషన్‌లో 14,3,34,,38 డివిజన్లకు తాజాగా ఎంపీ నిధులు కేటాయించినట్లు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.ఈ పనులకు త్వరలోనే శంకు స్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుందని ఎంపీ నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking