స్వయంగా జీరో కరెంటు బిల్లు తీసిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 1 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ముదిగొండ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలవేళ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇటీవల సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కలు లాంఛనంగా గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి మాసంలో 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించిన వారికి ఈ మార్చి మాసంలో జీరో వస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం తన మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండల కేంద్రంలో ఇద్దరు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి జీరో బిల్ తీసి గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు సిఎండి వరుణ్ రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking