అతివేగంతో ప్రమాదాలకు కారణం అవుతున్న కర్ణాటక బస్సులు

 

డ్రైవర్ , అతివేగం, అజాగ్రత్త వల్ల మోటర్ సైకిల్ కు డి,

….ప్రముఖ గాయకులు అయిదాల సునీల్

సంగారెడ్డి మార్చి 01 ప్రజ బలం ప్రతినిది:
జహీరాబాద్ మండలం దిడ్గి గ్రామ సమీపంలో సొన్నాయిల ప్రశాంత్ అనే వ్యక్తి సొంత పనుల కోసం దిడ్గి గ్రామం నుండి మోరే నగర్ కాలనీ వైపు తన మోటర్ సైకిల్ పై బార్య ఇద్దరు పిల్లలతో ప్రయాణిస్తూ ఉండగా జహీరాబాద్ నుండి బీదర్ వైపు ప్రయాణిస్తున్న కర్ణాటక బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్షం, అతివేగం, అజాగ్రత్త వల్ల గురువారం రాత్రి సమయంలో మోటర్ సైకిల్ కు టక్కర్ చేయడం జరిగింది అని అయిదాల సునీల్ అన్నారు. ఈ ప్రమాదంలో ప్రశాంత్, అతని భార్య పిల్లలకు బలమైన గాయాలు, కాళ్ళు విరగడం, మెదడుకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నలుగురు చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలంలో చేరుకున్న ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిదులు, ప్రముఖులు మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వ బస్సులు ఈ మార్గంలో ఇప్పటికీ చాలా ప్రమాదాలకు కారణం అవుతున్నాయని, డ్రైవర్లు విపరీతమైన వేగం, నిర్లక్షపూరిత డ్రైవింగ్ వల్ల జహీరాబాద్ ప్రాంత ప్రజలు అనేకమంది ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ అధికారులు తక్షణమే కర్ణాటక అర్.టి.సి యాజమాన్యం తో మాట్లాడి డ్రైవర్ల నిర్లక్షం పట్ల చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking