ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..మామడ మండలం పరిమండల్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అధనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న సమస్యలను తెలుసుకొని వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 7,8 తరగతి విద్యార్థులకు కూర్చునేందుకు ఇబ్బంది ఉందని తెలుసుకొని త్వరలో ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి బెంచ్ లను ఏర్పాటు చేస్తామని అన్నారు, ప్రభుత్వ నుండి ఆలస్యం అయినట్లయితే తన సొంత నిధులతో విద్యార్థులకు బెంచ్ లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులు ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించి సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపిడిఓ, ఎంఇఓ,ఎంపీటీసీ లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.