ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 21 : మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి భారీ స్పందన మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రేమ్ సాగర్ రావు పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి భారీ స్పందన వచ్చింది.గుమ్మడి రాజలింగు పౌండేషన్ సంస్థ ద్వారా డా,గుమ్మడి కిరణ్ కుమార్ ఇట్టి వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు మరియు మందులు అందచేశారు.ఈ కార్యక్రమం జిల్లా నాయకులు దండేపల్లి మండల కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంస్థ నాయకులు పాల్గొన్నారు.