గమన్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్, నెక్స్ట్ జెన్ హాస్పిటల్స్ సౌజన్యంతో డాక్టర్లు పాల్గోన్నారు
కుకట్‌పల్లి ప్రజా బలం ప్రతినిధి సామాజిక స్పృహతో యువత తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. రమేష్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శివచౌదరి, బచ్చు మల్లి, బాబ్జి ఆధ్వర్యంలో కూకట్పల్లి బాలాజీ నగర్ మరియు కూకట్పల్లి హోసింగ్ బోర్డులో హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు . ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై ఉచిత హెల్త్ క్యాంపు ను ప్రారంభించారు. గమన్ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్, నెక్స్ట్ జెన్ హాస్పిటల్స్ సౌజన్యంతో డాక్టర్లు పదుల సంఖ్యలో ప్రజలకు షుగర్, బీపీ,థైరాయిడ్,గ్యాస్ట్రో, లుంగ్స్, ఆర్థో వంటి పలు పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ నిర్వాహకులను, డాక్టర్లను అభినందించారు. పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా ఇలాంటి సేవా కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని కాంగ్రెస్ యువ నాయకులకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు శేరి సతీష్ రెడ్డి, లక్ష్మణ్, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు సాధు ప్రతాపరెడ్డి, బచ్చు రాజా, నళినీకాంత్, రేష్మ, సుధ, శ్రీరామ్, బుజ్జి, ఇంద్రనాథ్, ఫార్మా శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post