గండీపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 16 డిసెంబర్ 2024
మణికొండ పురపాలక సంఘం పరిధిలోని పుప్పాలగూడ లక్ష్మి నరసింహ స్వామీ నగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం అలకాపూర్ గీతాంజలి వేదిక స్కూల్ వెనుక ప్రక్కన గల డిలైట్ హాస్పిటల్ వారి ఆద్వర్యంలో నిర్వహించడ మైనదని అందులో లక్ష్మి నరసింహ స్వామీ నగర్ స్థానిక నివాసులు పెద్దయెత్తున పాల్గొన్నారని వారికి డాక్టరులు రక్త పోటు పరీక్షలతో పాటు అనేక రకాల ఉచిత సేవలందించారని కిరణ్ కుమార్ మట్టేవాడ తెలియ పరుస్తు ఇట్టి కార్యక్రమంలో అజయ్ కుమార్ రెడ్డి, ప్రహ్లాద్, ప్రణీత్, శ్రీనివాస్, రవి, రామకృష్ణ, సదా పటేల్, జయశంకర్, వేణు, నరేష్ తది తరులు స్వచ్ఛంద సేవలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించినారు.