ఏపీఎం పెంటాగౌడ్
మెదక్ (మనోహరాబాద్) ప్రజా బలం న్యూస్ :-
గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువకులకు ఉపాది కల్పనకై ఉచితంగా బైక్ మెకానిక్లో నెల రోజుల పాటు ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాది శిక్షణా సంస్థ ద్వార శిక్షణ ఇవ్వనున్నట్టు మండల ఐకేపీ ఏపీఎం పెంటాగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలకై ఎదరుచూస్తున్న నిరుద్యోగ యువకులు బైక్ మెకానిక్ ద్వార ఉపాధిని పొందాలని సూచించారు. మే 2 నుంచి మే 31 వరకు మెకానిక్ లో శిక్షణ ఉంటుందన్నారు. బైక్ మెకానిజంలో పది సంవత్సరాలలో నేర్చుకోవాల్సి మెకానిజాన్ని కేవలం నెల రోజుల్లో నేర్పించడం జరుగుతుందన్నారు. ఎస్బీఐ గ్రామీణ ఉపాది శిక్షణ
సంస్థ ద్వారా ఇచ్చే శిక్షణ సంగారెడ్డిలో ఉంటుందని మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువకులు అర్హులన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు వయస్సు కలిగి ఉండాలని అభ్యర్థులకు ఉచిత భోజన వసతితో పాటు యూనిఫాం ఇస్తారని శిక్షణ అనంతరం సర్టిఫికేట్ను కూడా ఇవ్వనున్నట్టు ఎస్ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ వంగా రాజేంద్రప్రసాద్ తెలిపారన్నారు. అభ్యర్థులు రేషన్ కార్డు జిరాక్స్, ఆదార్ కార్డ్ జిరాక్స్, పదవ తరగతి మెమో జిరాక్స్, పదవ తరగతి చదవని వారు కూడా మెకానిజాన్ని నేర్చుకోవచ్చని, నాలుగు ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ వివరాలతో ఈ నెల 29 లోగా దరఖాస్తు చేసుకోవాలని పెంటాగౌడ్ సూచించారు. పూర్తి వివరాలకై 9490103390, 9490129839 నంబర్ కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు సంప్రదించాలని పెంటాగౌడ్ సూచించారు.