వర్షాలు కురవాలని కప్ప తల్లి ఆట.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 15

జమ్మికుంట అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ మండల అధ్యక్షులు అంబాల రజనీకాంత్ ఆధ్వర్యంలో వర్షాలు కురవాలని కప్పతల్లి ఆట ఆడారు.ఈ సందర్భంగా అంబాల రజనీకాంత్ మాట్లాడుతూ వర్షకాలం మొదలై సుమారు నెలరోజులు గడుస్తున్న మన ప్రాంతాలలో ఇప్పటి వరకు వాన జాడలేదు, రైతులు పత్తి విత్తనాలు పెట్టి వాన రాక కోసం ఆ వాణరుడు కరుణించారని తొలకరి వాన కురవాలని ఆశతో ఎదురుచూస్తున్నారు.
పెట్టిన విత్తనాలు మొలకెత్తక పోతే రైతులు నష్ట పోవాల్సి ఉంటుంది, రైతు క్షేమంగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని పూర్వకాలంలో మన పెద్దలు వర్షాలు కురవాలని కప్పతల్లి ఆట ఆడేవారని అదే తీరున నేడు అగ్రికల్చర్ ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ వీదిలో అంబాల రజనీకాంత్ కప్పతల్లి ఆట ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కమిటీ సభ్యులు వోల్లాల మురళి, యాదగిరి, సంపత్, దొడ్డి రాజు , చిరంజీవి, శ్రీనివాస్, సురేష్, రాజు కుమార్, నరేష్ , రాజు,శ్రీకాంత్, రాజేష్ ,సంతోష్, ఐలయ్య, రాజకుమార్, రాజు, కుమారస్వామి, సుమంత్, సంతోష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking