పీఎం కిసాన్ యోజన రైతులకు ఓ వరం లాంటిది.

ఈనెల 18న వారణాసిలో కిసాన్ సమ్మేళనం కార్యక్రమం ప్రారంభం.

జమ్మికుంట కెవికె లో వర్చువల్ గా జరిగే కార్యక్రమానికి హాజరుకానున్న కేంద్రమంత్రి సోమన్న

-బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి…

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 15

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన ఓ వరం లాంటిదని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఈనెల 18న ప్రధాని మోదీ కిసాన్ సమ్మేళన్ ప్రోగ్రాం నేపథ్యంలో జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం లో వర్చువల్ గా జరిగే ప్రోగ్రాం ఏర్పాట్లను స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18న వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్న కిసాన్ సమ్మేళన్ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్చువల్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనీ తెలిపారు. ఇట్టి ప్రోగ్రాం జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర జల, రైల్వే సహాయక మంత్రి వి సోమన్న హాజరవుతారని తెలిపారు. జమ్మికుంటలో జరగబోయే కార్యక్రమాన్ని రైతులందరూ విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ముఖ్యంగా 17వ విడుత కిసాన్ సమ్మన్ నిధి యోజన నిధులు విడుదల చేయడం జరిగిందని, ఇన్స్టాల్మెంట్ కు సంబంధించిన ఫైల్ పైనే మూడోసారిగా ప్రధానమంత్రి మోడీ సంతకం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యంగా మిలియన్ల రైతులకు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తుందన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సమయం ప్రారంభం కావడంతో రైతులకు పెట్టుబడికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు వెంకటేశ్వరరావు ప్రభాకర్, అనిల్, ఆలేటి ప్రశాంతి జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ జిల్లా కిషన్ మోర్చా మాడుగుల సమ్మిరెడ్డి జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు పల్లపు రవి దొంతల రాజకుమార్ పరిపెల్లి కొండల్ రెడ్డి కైలాసకోటి గణేష్ మోతే స్వామి అప్పం మధు యాదవ్ ఇటుకల స్వరూప భీమిలి కిషన్ రావు మోడం రాజు గిరవని విజేందర్ మేక సుధాకర్ రెడ్డి రాచపల్లి ప్రశాంత్ గర్రెపల్లి నిరుపా రాణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking