డేటా కరెక్షన్ నుండి 233/ అ/1/1 సర్వే నంబర్ను తీసివేయాలని తూప్రాన్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు బాదితుల ఆందోళన.

 

మెదక్ తూప్రాన్ 28 జులై
ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని నర్సంపల్లి గ్రామ శివారులో 233/అ/1/1 సర్వే నెంబర్లు వ్యవసాయ భూమి విస్తీర్ణం రెండు ఎకరాలు జింక చంద్రశేఖర్ ఒక ఎకరం 10 గుంటలు, మరియు జింక శ్రీశైలం 30 గుంటలు మల్కాపూర్ గ్రామానికి సంబంధించిన జింక నవీన్ అనే వ్యక్తి వద్ద నుండి మూడున్నర సంవత్సరాల క్రితం కొనుగోలు చేయడం జరిగింది. మాకు విక్రయించిన నవీన్ గతంలో యాదగిరి అనే వ్యక్తి వద్ద నుండి కొనుగోలు చేశాడు. అయితే కొంతమంది బ్రోకర్లు అధికారులచే కుమ్ముకై ఇట్టి సర్వే నంబర్ను డేటా కరెక్షన్లో వేయడం జరిగిందని మా భూమిని మేము అమ్ముకోకుండా డేటా కరెప్షన్లో చేయడమేమిటని గమనించిన భూ నిర్వాసితులు ఎమ్మార్వో కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సదరు అధికారి తెలుపుతూ ఇట్టి ఫిర్యాదు పై చర్యలు చేపడతామని ఆర్ ఐ. నీ స్థలం వద్దకు పంపిస్తానని హామీ ఇచ్చారు. మరునాడు వచ్చి అడిగితే పై అధికారులకు ఫిర్యాదు చేసుకోమని తెలపడం జరిగిందని బాధితులు ఒక ప్రకటన ద్వారా ఆరోపించారు. మీడియా ప్రతినిధులు అనంతరం తూప్రాన్ మండల ఎమ్మార్వో జ్ణాన జ్యోతి గారిని వివరణ అడగగా వారు మాట్లాడుతూ ఈ స్థల విషయంలో అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగిందని ఈ రెండు ఫిర్యాదులను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వివరణ అడిగి , పై అధికారులు ఏ విధంగా స్పందిస్తే ఆ విధంగా చర్యలు చేపడతామని ఆమె తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking