జీహెచ్‌ఎంసి ముందు టీపీసీసీ ధర్నా

హైదరాబాద్‌ శుక్రవారం నాడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యాలయం ముట్టడి జరిగింది. అంతకుముందు గన్‌ పార్క్‌ నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తరువాత జిహెచ్‌ఎంసి ఆఫీస్‌ ముందు ధర్నాచేసి కమిషనర్‌ కు వినతిపత్రం ఇచ్చారు. వరదలల్లో జనం అల్లాడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. హైదరాబాద్‌ వరద బాధిత కుటుంబాలకు పది వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. ఈ నేపధ్యంలో జిహెచ్‌ఎంసి కార్యాలయం వద్ద తీవ్ర తోపులాట ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను నాయకులను అరెస్టు చేసారు. కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా తరలి రావడంతో తీవ్రంగా ట్రాఫిక్‌ జాం అయింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking