జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
ప్రజాబలం దినపత్రిక మెదక్ జిల్లా ప్రతినిధి 08.10.2024:
ఈ మంగళవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లాఎస్.పి. .డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన కొన్ని మూఢ నమ్మకాల సంఘటనలను దృష్టి లో పెట్టుకుని రాష్ట్ర జన విజ్ఞాన వేదిక అద్యక్షులైన చలమల రాజేశ్వర్ గారి మరియు రాష్ట్ర కార్యవర్గ సబ్యులతో మెదక్ జిల్లాలో మూఢ నమ్మకాల పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.. జన విజ్ఞాన వేదిక ద్వారా సమాజంలో శాస్త్ర దృక్పధంతో సంబంధం లేకుండా జరుగుతున్న మూఢ నమ్మకాలను ఎదిరించి సామాన్య ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని సామాన్య ప్రజానీకంలో శాస్త్ర విజ్ఞాన ప్రచారం, శాస్త్రీయ ఆలోచనా దృక్పథం పెంపొందించడానికి కృషి చేయాలని మూఢ నమ్మకాలు, ఛాందస భావాలను అరికట్టేందుకు విస్తృత ప్రచారం చేసి అవాగాహన సదస్సులు జిల్లాలో నిర్వహించాలని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శాస్త్రీయ విజ్ఞానాన్ని విస్తృతంగా ప్రజాదరణ వైపు చేసి పజలవ ఉన్నమూఢ నమ్మకాలను అప నమ్మకాలను తొలగించి దైనందిన జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు మూఢనమ్మకాల యొక్క చెడుల గురించి వారిని ఆకట్టుకోవడానికి కృషి చేయాలని కోరడమైనది. అలాగే ప్రజలలో మూఢనమ్మకాలు పోయేలా శాస్త్ర పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు జనవిజ్ఞాన వేదిక ద్వారా జిల్లాలో కార్యక్రమాలు నిర్వచాలని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలను పారద్రోలడానికి అవాకాశం ఉంటుందని అలాగే ఇలాంటి దూరాచారాలను పారద్రోలడానికి కళా జాత బృందాలు గ్రామాల కుల పెద్దలు కులసంఘాలు, గ్రామ పెద్ద మనుసులు కూడా పోలీస్ వారితో సమన్వయంగా అవహగహన కార్యక్రమాలు చేపట్టి ఈ మూఢ నమ్మకాలను కూకటి వేళ్ళతో పారద్రోలీనప్పుడే ఈ అపనమ్మకాలు పూర్తిగా రూపు మాపవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమం లో జేవీవీ రాష్ట్ర కార్యదర్శి యన్. వెంకట రమణ రెడ్డి ,రాష్ట్ర ఉపాద్యక్షులు . వర ప్రసాద్ మహేందర్ ,జిల్లా నాయకుల యల్. దేవ్లా , శ్రీమతి. జేవీవీ రాష్ట మహిళా నాయకురాలు చలమల పద్మ పాల్గొన్నారు.
