తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
దీర్ఘకాలికంగా e-kubher ఈ (కూబర్) వద్ద పెండింగ్ లో ఉన్న వివిధ రకాల బిల్లులను మార్చి 31 లోపల విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏప్రిల్ 2022 నుండి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులైన 8నెలల పిఆర్సి ఎరియర్స్, సిపిఎస్ డిఎ ఎరియర్స్, పింఛన్ బకాయిలు, మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు, జిపిఎఫ్ లోన్లు, టి ఎస్ జి ఎల్ ఐ లోన్లు, సప్లమెంటరీ వేతనాల బిల్లులు, సంపాదిత సెలవుల బిల్లులు, KGBV ఉపాధ్యాయుల వేతన బిల్లులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బిల్లులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ బకాయిల బిల్లులన్నీ ట్రెజరీల్లో మంజూరు అయినప్పటికీ గత 6నెలల నుండి సంవత్సరం క్రిందటి వరకు సంబంధించిన బిల్లుల బకాయిలు నేటికీ వారి ఖాతాలలో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం మరొక వారం రోజుల్లో ముగుస్తున్నందున వెంటనే నిధులను విడుదల చేయాలని, ఇప్పుడు నిధులు విడుదల కాకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు జరిగేదాకా నిధులు విడుదల కాక ఇంకా చాలా ఆలస్యం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులకు సంబంధించిన నిధులను విడుదల చేసి వారి ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేశ్, చేగుంట తపస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావుల వెంకటేష్, బాల్ శెట్టి రేఖ, తపస్ నాయకులు మధుసూదన్ రెడ్డి, రమేష్, సుధాకర్ రెడ్డి, సుమతి, ప్రశాంత, మాధవి తదితరులు పాల్గొన్నారు.