తూప్రాన్ మున్సిపాలిటీ వినాయక్ నగర్ లో అస్తవ్యస్తంగా డ్రైనేజీ నిర్మాణం. పట్టించుకోని అధికారులు.

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా సాక్షాత్ ముఖ్యమంత్రి నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ వినాయక్ నగర్ , గాంధీనగర్ సీసీ రోడ్డు నిర్మాణానికి 40 లక్షలు, వినాయక్ నగర్లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి 24 లక్షలు గడ నిధులనుండి మంత్రి హరీష్ రావు సహకారంతో నిధులు నిధులు విడుదలయ్యాయి. ధనార్జన దేంగా ముందు చూపు లేకుండా డ్రైనేజీ నిర్మాణం. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు తూప్రాన్ మున్సిపాలిటీ వినాయక్ నగర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సీసీ రోడ్డు డ్రైనేజీ పనులు ప్రారంభించి కొన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పనులు వేగవంతం పుంజుకోవట్లేదని సంబంధిత ప్రజలు తమ యొక్క ఆవేదనను పేర్కొన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన నిమ్మకు నీరెత్తినట్టుగా పనులు జరుగుతున్నాయని మహిళలు తమ ఆవేదనను మీడియా ద్వారా తెలిపారు. పన్నుల్లో జాప్యం అలసత్వం నాసిరకము, డ్రైనేజీ లు చేపట్టడం లాంటివి నిర్లక్ష్యానికి చిహ్నాలుగా అగుపడుతున్నాయి. కాలనీవాసులకు దీని ద్వారా అనేక వసతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చిన్నపిల్లలకు స్కూలుకు వెళ్లడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని నిత్యవసర సరుకులు తీసుకురావడానికి ఆటంకాలుగా ఉన్నాయని ఇట్టి డ్రైనేజీ పనులలో నెలకొన్న జాప్యాల వలన మురికి నీరు ఇళ్ళ ముందు జాము కావడంతో క్రీములు కీటకాలు దోమలు వాటిపైన వ్యాప్తి చెంది గృహాలలోకి ప్రవేశించి రాత్రుల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వీటి ద్వారా అనేకమైనటువంటి వ్యాధులు ప్రజలే అవకాశాలు ఉన్నాయని కాలనీవాసులు తమ ఆవేదనను మీడియా పరంగా తెలిపారు తక్షణమే అధికారులు స్పందించి నిలిచి ఉన్న ఈ పనులను వెంటనే కొనసాగించాలని కొనసాగించాలని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking