ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. తెలంగాణ మున్నూరుకాపు జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షుడు గుమ్ముల అశోక్, ప్రధాన కార్యదర్శి నెరల్ వార్ కృష్ణ అధ్యక్షతన, ముఖ్య అతిధులుగా రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్‌పటేల్,స్థానిక మున్సిపల్ చైర్మన్ గండ్రత్ఈశ్వర్.పటేల్ నిర్మల్ పట్టణంలో స్థానిక టీఎన్జీవో భవన్లో 2023 డైరీని ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ. సమాజంలో ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిగా ఉంటూ ప్రజలను చైతన్య వంతులుగా తీర్చి దిద్దాలన్నారు.జర్నలిస్టు ఫోరం డైరీని ఆవిష్కరించి ఎంతో సమాచారాన్ని జర్నలిస్టులకు అందించారన్నారు. ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని ప్రశంసించారు. మున్నూరుకాపు జర్నలిస్టులు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో జర్నలిస్ట్ ఫోరం మరింత కీలక పాత్ర పోషించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుసాల పోశెట్టి, నర్సయ్య,మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు దాదే వెంకట్ పటేల్, ద్యావరశెట్టి మధు, గాండ్ల రాజ శేఖర్,సిరిపురం నాగరాజు,పుప్పాల శేఖర్,కుంట శ్రీనివాస్, పుప్పాల రాజు,ఫోరమ్ ముఖ్య సలహా దారులు యోగేశ్వర్ పటేల్,తదితరులు పాల్గొన్నారు.