మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 15:
కృషి, పట్టుదల, క్రమశిక్షణే మీ విజయానికి కారణమని, పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి, భవిష్యత్తు లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఇదే స్పూర్తితో చదువుకోవాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం విద్యార్థులకు బోధించారు.
శనివారం కీసర మండలంలోని బోగారంలో గల మేడ్చెల్, ఖైరతాబాదు, అంబర్ పేట్ లకు కలిపి నిర్వహిస్తున్న మహత్మాగాంధీ జ్యోతిబా పూలే, బిసి వెల్పేర్ రెసిడెన్షియల్ (బాలుర) స్కూల్, జానియర్ కాలేజీని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం తనిఖీ చేసారు.ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ కృషి, పట్టుదల, క్రమశిక్షణతో పదవ తరగతిలో విజయం సాధించి భవిష్యత్తులో ఏమి చదవాలి అనే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆదిశగా ముందుకు వెళ్లాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం విద్యార్థులకు సూచించారు. పదవ తరగతిలోని ప్రతి విద్యార్థితో ముచ్చటించారు. భవిష్యత్తులో ఏమి చదువుతారని, ఏగ్రూపు తీసుకుంటారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని, విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. భోజన శాలలో టేబుల్లు, కుర్చీలు విద్యార్థులకు సరిపడా ఏర్పాటు చేయాలని కలెక్టరు ప్రిన్సిపల్ కు సూచించారు. అవసరమైన మరమ్మత్తులు చేయించేందుకు అయ్యే ఖర్చులను యాజమాన్యానికి ఇచ్చే అద్దెలో కొంచెం కొంచెంగా మినహాయించి మరమ్మత్తులు చేయించాలని నిర్వాహాకులకు తెలిపారు. స్కూలులోని వంట శాలను, స్టోరురూంను కలియ తిరిగి పరిశీలించారు. స్టోరురూంలోని వంట సామాగ్రిని పరిశీలించి తడి లేకుండా సామాగ్రిని నిలువ ఉంచాలని కలెక్టరు స్టోర్ ఇంఛార్జిని ఆదేశించారు. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈరోజు మెనులో ఏమి వండారని వంటలను పరిశీలించారు. స్కూలు కాలేజీ కలిపి మొత్తం ఎంత మంది విద్యార్థులున్నారని, ఇంటర్ లో ఏఏ గ్రూపులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఫస్ట్ ఫెజ్ జెఈఈలో 89 శాతం సాధించిన కె.తరుణ్ ను కలెక్టరు అభినందించారు. తరుణ్ కు అవసరమైన స్టడీ మెటిరియల్ ను, అవసరమైన చేయూతనందించాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకట ఉపేందర్ రెడ్డి, కీసర తహాసీల్దారు అశోక్, ఇంఛార్జి ప్రిన్సిపల్ కేశవ, తదితరులు పాల్గొన్నారు.