సి. ఐ చేతుల మీదుగా వృద్ధ దంపతులకు ఆర్థిక సహాయం

 

-మానవత్వాన్ని చాటుకున్న హోమ్ గార్డ్ దాసరి శ్రావణ్ కుమార్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ పిబ్రవరి 15:

మందమర్రి మండలంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఏరియా హాస్పిటల్ దగ్గర వృద్ధ దంపతులు అట్కపురం రాజం, రాజేశ్వరిలు నివాసం ఉంటున్నారు. వీరి ఒక్కగానోక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా రాజంకు చేయి లేదు, రాజేశ్వరికి పక్షవాతం వచ్చి మంచాన పడ్డది . మందమర్రి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ దాసరి శ్రావణ్ కుమార్ వీరి కుటుంబ పరిస్థితిని తెలుసుకొని మీడియా పత్రికల ద్వారా, స్వచ్ఛంద సంస్థలకు వారు ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యను తెలియజేసి కొంత నగదును సేకరించారు. వచ్చిన మొత్తాన్ని నిత్యావసర వస్తువులను, శనివారం మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి చేతుల మీదుగా 8005 రూపాయల నగదు 75 కిలోల బియ్యం, రెండు దుప్పట్లు, పండ్లను అందించారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల గౌతమ్ చారి, వంశీ, ఎం.డి సద్దాం లు పాల్గొన్నారు. ఎవరైనా దాతలు వీరిని ఆదుకోవాలనుకుంటే నేరుగా ఈ నెంబర్ కు 93939 41940 ఫోన్ పే చేయవచ్చన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking