ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా అక్టోబర్ 05 :
ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్ కార్యాలయంలో అధికారికంగా కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి, కలెక్టరేట్ ఏ ఓ రాజ్ కుమార్, డిడబ్లు ఓ ఇంచార్జి శిరీష,
డిపిఆర్ఓ రఫిక్, కలెక్టరేట్ పర్యవేక్షకులు మహేష్ బాబు తదితరులు వెంకటస్వామి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు.
::::
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయము ములుగు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం మీటింగ్ హాల్లో హెచ్ఐవి ఎయిడ్స్
ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో , ఇంటెన్స్ ఫైడ్ ఐఇసి క్యాంపియన్ యొక్క గోడపత్రిక ఆవిష్కరణ మరియు సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా , DMHO డాక్టర్ . అల్లం అప్పయ్య మాట్లాడుతూ ,హెచ్ఐవి ఎయిడ్స్ పై గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మరియు జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి సమీక్షింస్తు , ఇటీవల ఆయుష్మణ్ ఆరోగ్య mandhir లో ఉన్న MLHP లందరికీ HIV TESTING విధానం పై శిక్షణ ఇవ్వడం జరిగిందని ,కావున గ్రామీణ స్థాయిలో కూడా వారి సేవలు వినియోగించుకోవలని తెలియచేశారు. ములుగు, ఏటూర్ నాగారం ICTC సెంటర్ లలో HIV పరీక్షలు విసృతంగా నిర్వహించాలని,95.95.95 వ్యూహం లో భాగంగా కొత్త +ve లను గుర్తించాలని అన్నారు.ఈ క్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ భవ్యశ్రీ గారు,DPMO సాంబయ్య గారు, దిశ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ జ్యోతి ,CSO సారయ్య, DMDO సాయి, ICTC,PPTCTC,DSRC,SSK,లింక్ వర్కర్ స్కీం, మారి స్వచ్చంద సంస్థ
కే ఎంపీ ప్లస్ నెట్వర్క్,SYO,WORD సంస్థలు స్టాఫ్ అందరు పాల్గొన్నారు.