కలెక్టరేట్ ప్రాంగణంలో బతుకమ్మ పండుగ సంబరాలు

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అక్టోబర్ 5:
తెలంగాణ ఆచార సంప్రదాయమైన బతుకమ్మ పండుగను మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూ, వైద్య శాఖల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లారెవెన్యూ అధికారి హరిప్రియ హజరయ్యారు. కలెక్టరేట్లోని మహిళ అధికారులు, సిబ్బందితో కలిసి డిఆర్ఓ బతుకమ్మ ఆటలో పాల్గొన్నారు. మహిళలందరు బతుకమ్మ పాటలు పాడుతూ ఎంతో ఆనందోత్సహాలతో బతుకమ్మ ఆడారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking