గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి సీతక్క

ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా అక్టోబర్ 05 :

గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన మంత్రి సీతక్క

ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసిన చిలుక మదుసూదన్ రెడ్డి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా ఎంపిక కావడం అభినందనీయం

ఎంతో ప్రసిద్ధిగాంచిన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను రైతులకు మరింత ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి

కాంగ్రెస్ రైతు సంక్షేమ లక్ష్యాలను చేరుకునేలా మార్కెట్ కమిటీ పని చేయాలి

మూసి నిర్వాసితులను టిఆర్ఎస్ రెచ్చగొడుతోంది

నిర్వాసితులకు పక్కా ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తోంది

అయినా ఆక్కసు తో బిఆర్ఎస్ రాజకీయాలు చేస్తోంది

100 ఎకరాల ఫామ్ హౌస్లకు కరెంటు ఫ్రీ గా ఇచ్చిన కెసిఆర్ ప్రభుత్వం.. పేదలను పట్టించుకోలేదు

అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు

ఫ్రీ కరెంటుతో పేద లైన్లో రేవంత్ రెడ్డి గారు వెలుగులు నింపుతున్నారు

ప్రజలు అవస్థలు పడద్దని రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వనిది

రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్లె కనిపిస్తున్నాయి

అర్హులందరికీ ఇందిరమ్మ నిర్మించాలని సీఎం ప్రణాళిక రూపొందించారు

తప్పుడు ప్రచారం చేయడానికి టిఆర్ఎస్ పనిగా పెట్టుకుంది

అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు రైతులను పట్టించుకోలేదు

కనీసం సన్న వడ్లకు బోనస్ ఇవ్వలేదు

నల్ల చట్టాలకు మద్దతుగా మోడీ పంచన చేరింది బిఆర్ఎస్

ఇప్పుడు రైతుల పేరుతో డ్రామాలు చేస్తున్నారు

ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా రైతుల కోసం టిఆర్ఎస్ మోసలి కన్నీరు కారుస్తోంది

కాంగ్రెస్ అంటేనే రైతన్నల పార్టీ

కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం చేసే పార్టీ

పేదలకు కూడు గూడు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన పార్టీ కాంగ్రెస్

ఏకకాలంలో లక్ష రుణమాఫీ చేయని టిఆర్ఎస్ ధర్నాల పేరుతో డ్రామాలాడుతుంది

కాంగ్రెస్ పేదలకు పంచిన భూములను సైతం ప్లాట్లు చేసి బిఆర్ఎస్ అమ్ముకుంది

అటువంటి టీఆర్ఎస్ రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking