ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా అక్టోబర్ 05 :
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ నిర్వహిస్తున్న అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు
బతుకు నిచ్చే అమ్మ బతుకమ్మ
మన బతుకు చెరువులు మీదే ఉంది
చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది
బతుకమ్మ పండుగ అంటేనే చెరువుల పండగ
చెరువులకు ఆడ బిడ్డలంతా ధన్యవాదాలు తెలిపే పండుగ బతుకమ్మ
చెరువులే తెలంగాణ ప్రాంతానికి జీవనాధారం
వర్షాధార పంటలకు తెలంగాణ ప్రసిద్ధి, చెరువులు నిండితేనే పంటలు పండుతాయి
ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ
బతుకమ్మ పూలకు నీటిని శుద్ధి చేసే గుణం ఉంటుంది
అందుకే చెరువులను శుద్ధి చేసే కార్యక్రమం బతుకమ్మ
మహిళల పసుపు కుంకుమలకు గౌరమ్మ ప్రతీక
తల్లిదండ్రులు తమ ఆడబిడ్డలకు నైవేద్య రూపాల్లో పౌష్టికాహారాన్ని అందించే పండుగ ఇది
మనసుకు, శరీరానికి ఉత్సాహాన్ని ఇచ్చే పండగ బతుకమ్మ ను ఘనంగా జరుపుకోవాలి
అప్పుడే సామూహిక జీవన విధానాన్ని కొనసాగించడంతోపాటు చెరువులను శుద్ధి చేసిన వాళ్ళం అవుతాం
ఎంత ఎత్తుకు ఎదిగినా మన ఆటపాటలే మన అస్తిత్వం
బతుకమ్మ బోనాలు మన అస్తిత్వ ప్రతీకలు
వాటిని భవిష్యత్ తరాలకు అందించే విధంగా తెలంగాణ సంబరాలను జరుపుకోవాలి
ఓ యూ స్టూడెంట్ గా ఇక్కడి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా
ఓయూ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానాని చెప్పారు.
