డిజిటల్‌ కార్డుల సర్వే ప్రక్రియను అధికారులు సమర్థవంతంగా నిర్వహణ..

 

చురుకుగా సర్వే చేస్తున్న అధికారులను అభినందించిన ప్రత్యేక అధికారి

సర్వే వేగవంతంగా జరిగేందుకు నోడల్, సమన్వయ అధికారులని, వివిధ శాఖల అధికారులతో టీం లను నియామకం.

సీఎంఓ ఆఫీస్ ప్రత్యేక అధికారి సర్వే సంగీత సత్యనారాయణకు పుష్పగుచ్చని ఇచ్చి స్వాగతం పలికిన

అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

మెదక్ పట్టణం మున్సిపాలిటీ 20వ వార్డులో డిజిటల్ ఫ్యామిలీ కార్డ్ సర్వే వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించినప్రత్యేక అధికారి

డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ

ప్రజా బలం దినపత్రిక మెదక్ నియోజకవర్గం 05.10.2024:జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన కుటుంబ డిజిటల్‌ కార్డుల సర్వే ప్రక్రియను అధికారులు సమర్థవంతంగా నిర్వరిస్తున్నారన డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ తెలిపారు.
శనివారం మెదక్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డు నందు డిజిటల్ హెల్త్ కార్డు సర్వేను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, తో కలిసి ప్రత్యేక అధికారి డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ . అక్టోబర్ 3 నుంచి 7 వరకు అయిదు రోజుల పాటు జరిగే ఈ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి, ఆయా కుటుంబాల సమగ్ర వివరాలను సేకరించి, సరైన విధంగా నమోదు చేయాలని సూచించగా, అధికారులు సమర్థవంతంగా…. బాధ్యతయుతంగా చేస్తున్నారన్నారు
ఈ సర్వే కోసం క్షేత్రస్థాయిలో
నోడల్ అధికారులను, సమన్వయ అధికారులను, వివిధ శాఖల అధికారులతో బృందాలను కలెక్టర్ నియమించామన్నారు
ఈమేరకుసంబంధించి.. కుటుంబాల్లో సర్వే తుది దశ కు చేరుకుంటుందని
సర్వే పూర్తయిన తర్వాత…. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సర్వే వివరాలు నమోదు అయ్యాయా…. లేదా అని ప్రతీ కుటుంబ వివరాలను ఒకటికి.. రెండు సార్లు
చెక్ చేసుకోవాలన్నారు
ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా…. నమోదు వివరాలు పక్కాగా ఉన్న తర్వాత నే పంపించాలని… అధికారులను సంగీత ఆదేశించారు.
సర్వేను ఎంత బాధ్యత గా… వేగవంతం గా చేస్తున్నారో…. అదే విధంగా ఎంపిక చేసిన ప్రతీ కుటుంబం వివరాలను కూడా అంతే బాధ్యత గా, పక్కాగా చెక్ చేయాలన్నారు
సర్వే కి సహకరిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులకు, ప్రజలకు డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఈ డిస్టిక్ మేనేజర్ సందీప్ ,సర్వే బృంద సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking