ప్రజాబలం ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో కంటి వెలుగు ప్రోగ్రాం ను గడ స్పెషలాఫీసర్ ముత్యంరెడ్డి ప్రారంభించారు. పేద ప్రజలలో వెలుగులు నింపాలనే సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ముత్యంరెడ్డి పేర్కొన్నారు. కంటి పరీక్షలు చేసి అవసరం ఉన్నవారికి కంటి అద్దాలను పంపిణీ చేయడమే కాకుండా, కంటి చూపు పూర్తిగా మందగించిన వారికి శస్త్ర చికిత్సలు ప్రభుత్వం ఉచితంగా చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నేమహాదేవి నవీన్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఎంపీఓ రమేష్, పిహెచ్సి వైద్యాధికారి ఆనంద్, వైద్య సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, మేకిన్ యువత పాల్గొన్నారు.