కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఫిషరీస్ డైరెక్టర్ గడప దేవేందర్.

కాంగ్రెస్ ఖండువా కప్పి పార్టీలో చేర్చుకున్న తుంకుంట నర్సారెడ్డి.

తూప్రాన్, ఏప్రిల్, 2. ప్రజాబలం న్యూస్ :-

బి.అర్.ఎస్ సీనియర్ నాయకులు, ఫిషరీస్ డైరెక్టర్ గడప దేవేందర్, లంబాడి ఐక్యవేదిక మెదక్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ జైపాల్ నాయక్ , పలువురు సంఘం నాయకులు మాజీ సర్పంచ్లు, మంగళవారం ఉదయం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి అధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మామిండ్ల జ్యోతీ కృష్ణ ముదిరాజు, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్ లు రామునిగారి శ్రీశైలంగౌడ్, భగవాన్ రెడ్డి , రవీందర్ రెడ్డి, నారాయణ గుప్తా, పల్లెర్ల రవీందర్ గుప్త, చెలిమెల రఘుపతి, బానాపురం రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామునిగారి చిన్న నాగరాజు, బోల్లు నరేందర్, తిమ్మాపురం నరసింహులు, ఎం.డి అస్ను భాయ్, ఎం.డి. ఉమర్, టి.ఎన్.శ్రీనివాస్, నర్సింగ్ రావు, బోల్లు నరేందర్, వెంకటపూర్ నర్సింలు, సుధాకర్ రెడ్డి, గౌతమ్ , అనిల్, నాగరాజ్, కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking