జగిత్యాల ప్రతినిధి, ఆగస్టు 8(ప్రజా బలం) ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఎల్లా గంగరాజం అన్నారు. మంగళవారం తమ సంఘ భవనంలో గద్దర్ సంతాప సభ నిర్వహించగా హాజరైన జిల్లా అధ్యక్షులు గంగరాజం చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంగరాజం మాట్లాడుతూ నిజాం రజాకార్ల అరాచకాలపై గద్దర్ పాడిన పాట నేటికి ప్రజల్లో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గద్దర్ పాడిన పాటలే ఉద్యమాన్ని మలిదశకు చేర్చాయన్నారు. గద్దర్ మరణం తెలంగాణ గేయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని భౌతికంగా గద్దర్ మనమధ్యలో లేకున్నా ఆయన పాడిన పాటలు వున్నంతకాలం చిరస్థాయిగా నిలిచివుంటారని గంగరాజం అన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ 1,2 అద్యక్ష, కార్యదర్శులు కొలిచాల రవీందర్, విటలయ్య, రాష్ట్ర కౌన్సిలర్ కనపర్తి నాగభూషణం, మాజీ అద్యక్షులు పెద్ది ఆనందం తోపాటు పలువురు ఉన్నారు.