జగిత్యాల ప్రతినిధి, ఆగస్టు 8(ప్రజా బలం) మహాజన సోషలిస్టు పార్టీ జగిత్యాల డివిజన్ ఇంచార్జ్ గా నక్క సతీష్ మాదిగ నియమితులయ్యారు. మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టగా ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ దూమాల గంగారాం మంగళవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో నియామక పత్రం అందజేశారు. ఎంఎస్పీని గ్రామ గ్రామాన బలోపేతం చేయడమే లక్ష్యంగా నక్క సతీష్ మాదిగ నియమకమని దూమాల గంగారాం పేర్కొన్నారు. తన నియామకానికి కృషి చేసిన జిల్లా కన్వీనర్ దూమాల గంగారాం, కో కన్వీనర్ బెజ్జంకి సతీష్ మాదిగ తోపాటు పలువురికి సతీష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ సురుగు శ్రీనివాస్, నాయకులు బొల్లే అనీల్ మాదిగ, బాలే అంజన్న, గడప శివ, లింగారెడ్డి ఉన్నారు.