ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో వైద్య శిభిరం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 08 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆద్వర్యంలో మంగళవారం నాడు లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం లో వైద్య శిభిరం నిర్వహించారు. వసతి గృహం లోని 75 మంది విద్యార్థులను పరీక్షించి మందులను అందజేశారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ… విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. అలాగే వర్షాకాలంలో దోమల బారిన పడకుండా దోమలు కుట్టకుండా పుట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ వైద్య శిభిరం లో ఎచ్ ఈ ఓ లక్ష్మణ్ స్వామి,వార్డెన్ పెండెం శ్రీహరి, ఎమ్ ఎల్ ఎచ్ పీ గిరిజశ్రీ ,హెల్త్ అసిస్టెంట్యం.ఏ.గఫూర్,ఏఎన్ఎం విజయదర్షిని తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking