ప్రజా గాయకుడు గద్దర్ రాజకీయ రంగ ప్రవేశం అభినందనీయం

 

సామాజిక కార్యకర్త
కే. శ్రీనివాస్ చారి

తూప్రాన్, మే 3 (ప్రజా బలం న్యూస్) :-

ప్రజా యుద్ధనౌక, గాయకుడు తూప్రాన్ పౌరుడు గద్దర్ అలియాస్ విటల్ రావు ప్రజాస్వామిక రాజకీయాలలోకి రావడం అభిలషనీయం. అయన చేసే ఉద్యమ పోరాటమే మార్పును తీసుకువస్తుందని తొలుత ఆయన భావించిన క్రమక్రమంగా ఆయనలో ప్రజాస్వామ్యం వైపు ఆలోచనలు మళ్లడం, ప్రజాస్వామ్యం పట్ల ఆయన పెంచుకోవడం మంచి పరిణామం. ఆయన రాజకీయాల్లోకి రావడాన్ని, అందునా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి గజ్వేల్ నియోజకవర్గం నుండి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడం ఎంతో అభినందనీయమని సామాజిక విశ్లేషకులు శ్రీనివాస్ చారి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజకీయాన్ని అత్యంత ప్రభావితం చేస్తుంది. కేవలం భౌగోళిక తెలంగాణ వచ్చినంత మాత్రాన మార్పులు రావని, సమస్యలు తీరవని మనకు గత 9 సంవత్సరాలలో అనుభవంలోనికి వచ్చింది. ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణా నిర్మించడంలో భాగంగా గద్దర్ పునరంకితం అవడాన్ని తెలంగాణ సమాజం స్వాగతించాలని ఈ సందర్భంగా తూప్రాన్ పరిరక్షణ సమితి ఆయన రాజకీయరంగ ప్రవేశాన్ని మరియు గజ్వేల్ ఎమ్మెల్యేగా పోటీ చేయడాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నమని విద్యావంతులు సామాజిక కార్యకర్త కె. శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking