ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాఘవేంద్ర రావు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి వందనం చేశారు.గాంధీజీ అహింస మార్గమే నేటి సమాజానికి ఆదర్శమని ఆయన వివరించారు.ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య సమర యోధులను గుర్తుంచుకుని వారి త్యాగాలను స్మరించుకోవాలన్నారు.అదే విధంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య గాంధీజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి వందనం చేశారు. బాపూజీ కలలుగన్న సౌరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.గాంధేయ మార్గంలో నడిచి ఉత్తమ పౌరులుగా రాణించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమీషనర్ కల్లెడ రాజశేఖర్,ఆర్ ఐ సంజీవ్,మున్సిపల్ మేనేజర్ శ్రీహరి,నాయకులు, కౌన్సిలర్లు,సిబ్బంది పాల్గొన్నారు.