హస్తం సత్తా చాటి… గులాబీ పార్టీని తుంచేద్దాం…!

కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా కలిసి పనిచేద్దాం

పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి

రూరల్ మండల ముఖ్యనాయకులతో ఆత్మీయ సమావేశం

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 2 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ హస్తం సత్తా చాటి గులాబీ పార్టీని తుంచేద్దామని ఆ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లి, మద్దులపల్లి, తల్లంపాడు, కొండాపురం, చింతపల్లి, వెంకటగిరి తదితర గ్రామాల్లో సోమవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లోని ముఖ్యనాయకులతో ఆత్మీయ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పాత, కొత్త కాంగ్రెస్ అనే తేడా ఉండొద్దని మనమందరం కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా కలిసి పనిచేద్దామన్నారు. బీఆర్ఎస్ ఓటమే మనందరి అంతిమ లక్ష్యంగా ఉండాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండాను ఎగురవేసి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కానుకగా ఇవ్వాలన్నారు. అభ్యర్థి ఎవరైనా వారి గెలుపునకు మనం కృషి చేయాలని ఆ దిశగా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుదామని పేర్కొన్నారు. తమ్మినేని నవీన్, నల్లపునేని అప్పారావు, యలసాని శివా రెడ్డి, శ్రీనివాస్, బైరు హరినాథ్ బాబు, ముత్యం కృష్ణారావు, తోట వీరభద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని తదితర ముఖ్యనాయకులను కలిశారు. ఈ పర్యటనలో ప్రసాద్ రెడ్డి వెంట పాలేరు నియోజకవర్గ నాయకులు చావా శివరామకృష్ణ, పార్టీ మండల అధ్యక్షులు కల్లెం వెంకట్ రెడ్డి, మద్ది కిశోర్ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, ఏనుగు వెంకట్ రెడ్డి, మెండె వెంకటేష్ యాదవ్, రానేరు మురళి, కర్లపూడి భద్రకాళి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking