అభివృద్ధి,సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం

 

లక్షెట్టిపేట మున్సిపాలిటీలో రూ.25 కోట్ల పనులకు శంకుస్థాపన

రూ.3 కోట్ల 25 లక్షల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే దివాకర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02 : ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు.సోమవారం ఎమ్మెల్యే పట్టణంలోని పలు వార్డుల్లో స్థానిక నాయకులతో కలిసి పలు పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం మౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తోందన్నారు.ప్రతి వార్డు లో సీ సీ రోడ్డు,డ్రైనేజి, విద్యుత్ అలంకరణ,ఇతర అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఖచ్చితంగా మేలు జరిగిందన్నారు.తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని వివరించారు. రైతు బంధు,రైతు భీమా, ఆసరా,కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్,దళిత బంధు, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు నిద్ర పట్టడం లేదని ఏద్దేవా చేశారు.వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి సీఎం కేసీఆర్ మరోసారి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కి చిరునామాగా మారిందన్నారు.అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.అంతకు ముందు మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే తమ అభిమతమని వివరించారు. ప్రతిపక్షాల అర్ధరహిత ఆరోపణలు పట్టించుకోకుండా కేవలం అభివృద్ధి,సంక్షేమం మీదనే ఎమ్మెల్యే దివాకర్ రావు దృష్టి సారించారని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే దివాకర్ రావు రూ.25 కోట్లతో పలు కాలనీల్లో శంకుస్థాపనలు, రూ.3 కోట్ల 25 లక్షలతో పలు పనులు ప్రారంభించారు. అదే విధంగా గోదావరి రోడ్ లో ఎలక్ట్రీషియన్,ప్లంబర్స్ అసోసియేషన్ భవన్ కు భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గడికొప్పుల ఉమాదేవి కిరణ్,గోడిసేల లక్ష్మీ,రాజన్న, బీ ఆర్ ఎస్ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్,మాజీ ఎంపీపీ కట్ల చంద్రయ్య, నాయకులు నడిమెట్ల రాజన్న,చింత అశోక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking