మహబూబాబాద్ ప్రతినిధి అక్టోబర్ 02 (ప్రజాబలం) మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట టియూడబ్ల్యుజే (ఐ జేయూ) రాష్ట్ర పిలుపు మేరకు కురవి మండల అధ్యక్షులు గుంటి సురేష్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.సీనియర్ జర్నలిస్ట్ బేతమల్ల సహదేవ్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులందరికీ ఇండ్లస్థలాలతోపాటు డబుల్ బెడ్ రూములు, ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఈనాటి వరకు కనీసం ఏ సమస్యను పరిష్కరించకపోవడంతో ప్రభుత్వం విఫలమైందని అని అన్నారు. అదేవిధంగా రైల్వే పాసులు, హెల్త్ కార్డ్స్, డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మా జర్నలిస్టు సమస్యలు పరిష్కరించకపోతే అనేక ఉద్యమాల్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తామని హెచ్చరించారు.