గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలి.చంద్ర శేఖర్ రెడ్డి, ఐపిఎస్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్,మల్టి జోన్ 1

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..భైంసా మరియు నిర్మల్ లో జరుగు గణపతి నిమజ్జనం సందర్భంగా చంద్ర శేఖర్ రెడ్డి, ఐపిఎస్,ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మల్టి జోన్ 1 గారు ఈ రోజు నిర్మల్ విచ్చేసిన సందర్బంగా జిల్లా పొలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.
అధిక సౌండ్ నిచ్చే డీజే లు,పక్క రాష్ట్రాల నుండి వచ్చే డీజె లు పట్టనివ్వ్వద్దని, మరియు బాణాసంచా కాల్చడం వంటివి చేయకుండా చూడాలన్నారు, లేజర్ లైట్స్ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి మరియు డి.జె వాహనం పైన పేపర్ ముక్కలు విసిరే మోటార్ నీ వదద్దని ప్రజలకు సూచించారు.ఇట్టి వాటిని వాడితే వారి మీద చట్ట పరమైన చర్యలు తీసుకొనబడునని సూచించారు.
విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలపై మద్యం మత్తులో ఉన్నవారిని అనుమతించ కూడదని ఇట్టి వసాయాని ఉత్సవ కమిటీ నిర్వాహకులకు తెలీజేయాలన్నారు.
రెచ్చగొట్టే నినాదాలు చేయడం,మత స్థలాల దగ్గర ఊరేగింపులను ఆపడంవంటివి చేయరాదన్నారు. కనులపండుగగా జరుగు గణేష్ నిమజ్జన యాత్రను ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో జరపాలని ఎవరు కూడా ఇతర భక్తులకు కానీ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించరాదని తెపినారు.
ప్రతి విగ్రహం ఉదయంమే బయలు దేరాలని, వాహనాలపై పరిమితికి మించి వెళ్ళకూడదు. ఊరేగింపు సమయంలో కరెంటు తీగలను గమనించి వాహనాన్ని నడపాలి. నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్లేటప్పుడు రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయకూదన్నారు. వాహనాలకు తగిన దారి ఉండేలా ఉత్సవ కమిటీ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రజలు శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకునేందుకు ముందస్తు ప్రణాళికతో పోలీస్ అధికారులు అన్ని శాఖల అధికారులతో కలిసి పనిచేయాలని సూచించారు.నిర్మల్ మరియు భైంసా పట్టణంలలో ముఖ్యమైన ప్రాంతాలలో సి.సి కెమెరాల ఏర్పాటు చేయడం గురుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా గణేష్ నిమజ్జనం రూట్లో సి.సి కెమెరాల ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కెమెరాలు సోలార్ తో కూడా పనిచేసేలా ఏర్పాటు చేశామనీ,ఈ కెమెరాలు పూర్తిగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయడం జరిగిందని ఈ సి.సి టివిలు 24×7 ప్రకారంగా పూర్తిగా సిబ్బంది పర్యవేక్షణలో ఉంటయని, నిమజ్జనం రోజు ఆయా రూట్లలో విద్యుత్‌ శాఖ, ఆర్‌ అండ్‌బీ శాఖల మరియు ఇతర శాఖల సమన్వయంతో నిమజ్జనోత్సవం సాఫీగా సాగేలా చర్యలు చేపట్టామనీ. గణేష్ నిమజ్జనం చేయుటకు భద్రతాపరమైన పూర్తి సన్నాహాలు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ తెలిపారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ఎస్పీ గారితో పాటు, డిఎస్పీ గంగా రెడ్డి, సీఐ లు నవీన్, ప్రవీణ్, రామ కృష్ణ, అశోక్,అర్ ఐ లు శేఖర్, రమేష్,రామ కృష్ణ మరియు ఆర్ఎస్ఐ లు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking