జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 14
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మేటి రెడ్డి శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రాత్రి ఆహారం తీసుకుని పడుకున్న తర్వాత నిద్రలోనే గుండెపోటు రావడంతో మృతి చెందాడని తెలిపారు. కుటుంబ సభ్యు లు హుటాహుటిన జమ్మికుంట ప్రభుత్వ హాస్పటల్ కు తీసుకొని రాగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలిపారు.