నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే సత్యనారాయణ
జమ్మికుంట, ప్రజా బలం ప్రతినిధి సెప్టెంబర్ 14
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మేటి రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రాత్రి ఆహారం తీసుకుని పడుకున్న తర్వాత నిద్రలోనే గుండెపోటు రావడంతో మృతి చెందాడని ఆయన తెలిపారు. కుటుంబ సభ్యు లు హుటాహుటిన జమ్మికుంట ప్రభుత్వ హాస్పటల్ కు తీసుకొని రాగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలిపారు. సమ్మిరెడ్డి మరణ వార్త తెలియగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. హుజురాబాద్ నియోజకవర్గం లో సమ్మిరెడ్డికి ఎనలేని గుర్తింపు కలిగిన నేతగా పేరుంది .సమ్మిరెడ్డి మరణ వార్త తెలియగానే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ శనివారం మధ్యాహ్నం సమ్మిరెడ్డి పార్థివదేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం బీసీ శాఖ మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,డిసిసి అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సమ్మిరెడ్డి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించి సమ్మిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అంతకుముందు రాజకీయ పార్టీలకతీతంగా పలువురు రాజకీయ నేతలు సమ్మిరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు .సమ్మిరెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వెలువడిన కాంగ్రెస్ వాయిస్ పత్రికకు సంపాదకులుగా పనిచేశారు .అలాగే నాటి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి ,దివంగత కాంగ్రెస్ నేత ఎం సత్యనారాయణ రావుకు అనుచరునుగా గుర్తింపు పొందిన సమ్మిరెడ్డి లేని లోటును కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి .
