బైక్ దొంగలను పట్టుకున్న, జిల్లా సి‌సి‌ఎస్, శివంపేట పోలీసులు.

 

నిందితులపై 17 బైకులు 01 స్కూటీ దొంగతనం కేసులు గుర్తింపు.

ద్విచక్ర వాహనలే లక్ష్యంగా దొంగతనం.

17 బైక్ లు , 01 స్కూటీ స్వాదినం.

సీజ్ చేసిన వాహనాల మొత్తం విలువ రూ. 5,90,000/ నగదు 20,000/- మొత్తం 6,10,000/-
ఇద్దరు నిందితులు రిమాండ్ కు తరలించడం జరిగినది.

జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.

ప్రజాబలం దినపత్రిక మెదక్ నియోజకవర్గo
14.09.2024:

మెదక్ జిల్లా శివంపేట పోలీసు స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించి జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
నిందితుడు జల్సాలకు అలవాటుపడి ఇళ్ల ముందర పార్కింగ్ స్థలాల వద్ద, రోడ్ల పక్కన రక్కి చేసి , ద్విచక్ర వాహనాలను గుర్తించి దొంగలిస్తాడు. ఇలా దొంగలించిన వాటిని తక్కువ ధరకు అమ్మడం చేస్తున్నారని గుర్తించాము అని ఎస్పి గారు అన్నారు.
కేసు వివరాలు;
శివంపేట ఎస్‌ఐ కి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు నెరస్థులను తమ ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకుని జిల్లా సి‌సి‌ఎస్ టీంమరియు తమ సిబ్బందితో విచారించడం జరిగినదని వారి వివరాలను వెల్లడిస్తూ..
మెదక్ జిల్లా శివంపేట మండలం రూప్లా తాండాకి చెందిన నింధితుడు ఏ -1 జర్పుల మోహన్ S/o ధన్ సింగ్, వయస్సు. 26 సంవత్సరాలు, కులం, ఎస్టీ లంబాడా, ఓసీసీ . లేబర్ (ఫ్లవర్ డెకరేషన్), R/o కొత్తపేట్ గ్రామం రూప్లా తండా శివ్వంపేట మండలం మెదక్ జిల్లా . జల్సాలకు అలవాటుపడి ఇళ్ల ముందర పార్కింగ్ స్థలాల వద్ద, రోడ్ల పక్కన రక్కి చేసి , ద్విచక్ర వాహనాలను గుర్తించి దొంగలిస్తాడు. ఇలా దొంగలించిన వాటిని తక్కువ ధరకు ఏ -2 ఎర్ల నరేష్ స/ఓ చంద్రయ్య, వయస్సు. 27 సంవత్సరాలు, కులం, ముదిరాజ్, Occ. ప్రైవేట్ ఉద్యోగం, మెదక్ జిల్లా నర్సాపూర్ మండలానికి చెందిన ర్ /o రెడ్డిపల్లి గ్రామం అతనికి అమ్మడం చేస్తున్నాడని తెలిపినారు. విచారణలో భాగంగా నింధితుడు శివ్వంపేట, నార్సింగి, మనోహరాబాద్, కుల్చారం, కూకట్‌పల్లి కేపీహెబ్ , సనత్‌నగర్ ఏరియాల పరిధిలో మొత్తం 18 చోరీలు చేసినట్టు నిందితుడు అంగీకరించారు. ఇలా గుర్తించిన కేసుల్లో 17 బైక్‌ లు ఇక స్కూటీ ఉన్నాయని నిందితుడు ఏ -1 జర్పుల మోహన్ S/o ధన్ సింగ్ ఇంటి వద్ద 13 వాహనాలను నిందితుడు ఏ -2 ఎర్ల నరేష్ తండ్రి చంద్రయ్య, దగ్గర స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినామని అన్నారు.
ఈ కేసుల చేధనలో పని చేసిన తూప్రాన్ డీస్పీ వెంకట రెడ్డి ని, తూప్రాన్ సిఐ రంగ కృష్ణ ని సీసీస్ ఇన్స్పెక్టర్ తిరుమలేశ్ ని, శివంపేట ఎస్.ఐ మహిపాల్ రెడ్డి ని సీసీస్ సిబ్బంది ప్రశాంత్, దత్తు, రాము , చిట్టిబాబు శివంపేట కానిస్టేబుళ్లు గోపాల్, మహేందర్, జాన్, రాజు లను ఎస్పీ అభినందించి రివార్డ్ అందించారు.
నింధితుల వివరాలు :
ఏ -1 జర్పుల మోహన్ స్ /o ధన్ సింగ్, వయస్సు. 26 సంవత్సరాలు, కులం, ఎస్టీ లంబాడా, ఓసీసీ . లేబర్ (ఫ్లవర్ డెకరేషన్), ర్ /ఓ కొత్తపేట్ గ్రామం రూప్లా తండా శివ్వంపేట మండలం మెదక్ జిల్లా .
ఎ-2 ఎర్ల నరేష్ స/ఓ చంద్రయ్య, వయస్సు. 27 సంవత్సరాలు, కులం, ముదిరాజ్, Occ. ప్రైవేట్ ఉద్యోగం, R/o రెడ్డిపల్లి గ్రామం నర్సాపూర్ మండలం మెదక్ జిల్లా

Leave A Reply

Your email address will not be published.

Breaking