రియల్ ఎస్టేట్ అక్రమ దందులను సృష్టించిన వారిని అరెస్ట్

 

మెదక్ జిల్లా కోర్టు ముందు హాజరు పరిచిన శంకరంపేట పోలీసులు

జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పీ.ఎస్

ప్రజాబలం దినపత్రిక- శంకరంపేట మెదక్
14.09.2024:

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ….రియల్ ఎస్టేట్ ఆగడాల వలన ఎంతోమంది బాధితులు అయిన కేసుల్లో భరోసా కల్పించడానికి పెద్ద శంకరంపేట పోలీసులు నిందితులను ఈరోజు అరెస్ట్ చేసి మెదక్ జిల్లా కోర్టు ముందు హాజరుపరచడం జరిగినది.హైదరాబాదు నుండి పెద్ద శంకరంపేట మండల పరిధిలో భూములు కొనడానికని వచ్చిన వాళ్లను ఇక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మధ్యవర్తులుగా ఉండి రోడ్డు సైడు మెయిన్ బిట్ అమ్మడానికి ఉందని ఫేస్బుక్లో ఫోటోతో ఫోన్ నెంబర్ తో పోస్ట్ చేసి వారు సంప్రదించగా వారికి మెయిన్ రోడ్డు బిట్టు చూయించి ఎక్కువ డబ్బులు తీసుకొని మోసం చేసి రోడ్డు నుంచి దూరంగా ఉన్న వ్యవసాయానికి పనికిరాని నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లోని భూమిని రిజిస్ట్రేషన్ చేసి మోసం చేస్తున్నారు. హైదరాబాద్ లోని కూకట్పల్లి కి చెందిన ఆడం జ్యోతి గారు ఫేస్బుక్లో వారు చేసిన పోస్టుకు రెస్పాండ్ అయి పెద్ద శంకరంపేట లోని పుతులూరు గ్రామ శివారులోని రోడ్డు సైడు బిట్టు అమ్మడానికి ఉన్నదని దాన్ని 31 లక్షల 40 వేల రూపాయలకు మాట్లాడుకుని పెద్ద శంకరంపేట తాసిల్దార్ ఆఫీస్ లో డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత భూమి దగ్గరికి వెళ్లి చూసేసరికి మోసపోయిన విషయం తెలిసినది అందులో పెద్ద శంకరంపేట పిఎస్ లో ఏడుగురిపై ఫిర్యాదు ఇవ్వగా ఇట్టి ఫిర్యాదును పరిశీలించిన సిబ్బంది Cr. No. 133/2024 U/s 120 B, 406, 420, 417, 506 ర్ /w 34 ఐపీసీ నమోదు చేసి దర్యాప్తు చేసి ఈరోజు నిందితులు అయినటువంటి ఏ -1 చవాన్ సాగర్ స్ /o దేవిదాస్, వయస్సు: 27 సంవత్సరాలు, కులం: ఎస్టీ లంబాడా, ఓసీసీ : వ్యాపారం, ర్ /o ముకుంద నాయక్ తండా కంగ్టి మండలం, సంగారెడ్డి జిల్లా మరియు ఏ -3 జంగం శ్రీనివాస్ @ జంగం శ్రీను S/o నాగయ్య, వయస్సు: 52 సంవత్సరాలు, కులం: పద్మశాలి, ఓసీసీ : వ్యాపారం, ర్ /o శంకరంపేట గ్రామం మరియు మండలం, మెదక్ జిల్లా కోర్టు ముందు హాజరుపరచడం జరిగినది అని తెలిపినారు

Leave A Reply

Your email address will not be published.

Breaking