రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 15 సెప్టెంబర్ 2024
మాణికొండ లోని గణనాయకుల నిమజ్జనం సందర్భముగా ఆదివారం 15 సెప్టెంబర్ రోజున నెక్నంపూర్ సరస్సు వద్ద రాజకీయాలకు అతీతంగా మానవ సేవయే మాధవ సేవగా ముందుకు సాగుతూ వీ ఆర్ ఫర్ సహయోగ్ చారిటబుల్ ట్రస్టుచే భక్త జనుల సేవార్థం తలపెట్టిన బిసిబేలేభాత్ కు ప్రత్యాయమైన తెలంగాణ ప్రాంత రుచికరమైన సాంబరన్నం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, జిల్లా శంకర్ వారు వితరణ చేసినారని వీ ఆర్ ఫర్ సాహయోగ్ చారిటబుల్ ట్రస్టు నిర్వాహక ధర్మకర్త అందె లక్ష్మణ్ రావు మరియు సభ్యులు దిలీప్ కక్కడు, నిర్మలచంద గోలేచ, శ్రీధర్, రమ్యా, వీనీలలు తెలుపుతూ ఇట్టి శుభ తరుణంలో స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పద్మా రావు, నవీన్ కుమార్, వసంత్ రావ్ చౌహాన్, భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, బీ.జే.పి అధ్యక్షుడు బీరప్ప, సంగం శ్రీకాంత్, గుట్టమిది నరేందర్, రామసుబ్బ రెడ్డి, యాలల కిరణ్, మహేందర్, సురేష్, మోహన్, కుమార్, జై, మళ్లాపురం శ్రీనివాస్, ఉసేన్, మనోజ్, వెంకట చారి తది తరులు కార్యక్రమంల్లో పాల్గొని శుభ ప్రదం గావించినారని పాల్గొన్న భక్తులకు నాయకులకు ప్రభుత్వ అధికారులకు ట్రస్ట్ సవినయంగా ధన్యవాదములు తెలుపుతు ఆ దేవ దేవుడు అందరినీ ఆయుర్ ఆరోగ్యలతో అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసార కోరుకుంటూన్నము.
