మేకల దొంగతనాన్ని చేదించి బాధితులను ఆదుకున్న పెద్ద శంకరంపేట్ పోలీస్
మెదక్ జిల్లా
ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాలలో భారీ ఎత్తున మేకల దొంగతనం చేసి మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మేకల దొంగలు పట్టుబడినారని వారు వివిధ జిల్లాలో మొత్తం 16 దొంగతనాలు చేసి, దాదాపుగా వందకు పైగా మేకలను దొంగలించినారు. అట్టి మేకలను అమ్మిన డబ్బులతో ఎవరికి అనుమానం రాకూడదు అని గొర్రెలను కొని తిరిగి వాటిని అమ్మి సొంతగా వాహనాలు కొనుక్కొని దొంగతనం చేయాలని ఉద్దేశంతో ఉన్న సందర్భంలో ఈ రోజు పెద్ద శంకరంపేట్ పోలీస్ వారికి దొంగలు దొరికినారు.. ఇట్టి దొంగతనాలను 11 మంది ముఠా గా ఏర్పడి చేయడం జరిగింది అందులో ఆరుగురు పోలీసు వారి యొక్క అదుపులో ఉన్నారు వారి నుండి మొత్తం 4 లక్షల 71,000 రూపాయల నగదును అలాగే 9 మేకలను స్వాధీనం చేసుకొని 6 గురిని కోర్టు ముందు హాజరు పరచడం జరిగింది ఈ నగదును కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు చేరేటట్లు చేయడం జరుగుతుందని మిగతా ఐదుగురు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలియజేసినారు. దొంగతనానికి వాడిన రెండు వాహనాలను కూడా పోలీస్ అదుపులో తీసుకోవడం జరిగింది. అంతర్ రాష్ట్ర మేకల దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. అభినందించినారు.
నిందితుల యొక్క వివరములు
1) చిన్న కటికే ఖదీర్ పాషా @అప్పు (ముస్లాపూర్)
2) ఎరుకల గోపాల (గడి పెద్దాపూర్)
3) మహమ్మద్ సాహిద్ (sanga reddy)
4) ఇప్ప మహేందర్ (ముస్లపూర్)
5) ఎరుకల అనిల్ (గడి పెద్దాపూర్)
6) మెల్ల అనిల్ కుమార్ (గడి పెద్దాపూర్)
ఈ కార్యక్రమంలో అల్లాదుర్గ్ సిఐ శ్రీమతి. రేణుకా రెడ్డి ,పెద్ద శంకరంపేట ఎస్.ఐ . శంకర్ అల్లాదుర్గ్ ఎస్.ఐ శ్రీ.ప్రవీణ్ రెడ్డి ,అల్లాదుర్గ్ సర్కిల్ పోలీస్ స్టేషన్ ల సిబ్బంది పాల్గొన్నారు.