2025-26కు జి హెచ్ ఎం సి బడ్జెట్ రూ. 8,440 కోట్ల బడ్జెట్ కు స్టాండింగ్ క‌మిటీ ఆమోదం

 

హైదరాబాద్, డిసెంబర్ 23: 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రానికి జీహెచ్ఎంసీ రూ. 8,440 కోట్ల‌తో ప్ర‌వేశ‌పెట్టిన‌ బ‌డ్జెట్ అంచనా ప్ర‌తిపాద‌న‌ల‌ను సోమవారం జ‌రిగిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో స్టాండింగ్ క‌మిటి ఆమోదించింది.

న‌గ‌ర మేయ‌ర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి జీహెచ్ఎంసీ క‌మీష‌న‌ర్ ఇలంబర్తి, స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మహమ్మద్ ముజఫర్ హుస్సేన్, మహమ్మద్ ఖదీర్, మన్నె కవితా రెడ్డి, మహమ్మద్ రషీద్ ఫరాజుద్దిన్, ఉప్పలపాటి శ్రీకాంత్, సబిహ బేగం, చింతల విజయ శాంతి, కంది శైలజ, అడిషనల్ కమిషనర్లు శివ కుమార్ నాయుడు, గీతా రాధిక, సుభద్ర దేవి, నళిని పద్మావతి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, పంకజ, సరోజ, అశోక్ సామ్రాట్, రఘు ప్రసాద్, చంద్ర కాంత్ రెడ్డి, యాదగిరి రావు, జోనల్ కమిషనర్లు అపూర్వ్ చౌహాన్, అనురాగ్ జయంతి, రవికిరణ్, వెంకన్న, ఉపేందర్ రెడ్డి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వెంకటేశ్వర్ రెడ్డి, ఫైనాన్స్ అడ్వైజర్ శరత్ చంద్ర, సిసిపి శ్రీనివాస్, చీఫ్ వెటర్నరీ అబ్దుల్ వకీల్, సి.ఇ మెయింటెనెన్స్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బ‌డ్జెట్ పై స్టాండింగ్ క‌మిటీ స‌మావేశంలో విస్తృతంగా చ‌ర్చించి ఆమోదించారు. పలు విభాగాలకు సంబంధించి అడిగిన సభ్యుల సందేహాలను ఆయా అధికారులు నివృత్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking